Deendayal Upadhyaya Sahaya kendram
గత గత నాలుగు సంవత్సరాలుగా (కరోనా సంవత్సరం నుండి) హిందూ ఉపాధ్యాయులు టీచర్లు మాస్టర్లు లెక్చర్లకు సహాయం చేస్తూ ముఖ్యముగా ప్రైవేటు విద్యాలయంలో వారి యొక్క అవసరమును అనుసరించి ప్రైవేటు స్కూల్ యాజమాన్యంతో కూడా మాట్లాడి మన హిందూ ఉపాధ్యాయుల కు చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారము చేయుచున్నాము, ఉపాధ్యాయుల కుటుంబంలో వారి యొక్క కష్టనష్టములు తెలుసుకొని వారికి సరైనటువంటి మార్గదర్శనం చేస్తూ మన సంఘ పరివారంలో ఉన్నటువంటి పెద్దవారితో మాట్లాడించి డాక్టర్లచే లాయర్లచే అవసరమైన సహాలెప్పిస్తూ తగిన సహాయము చేయుచున్నాము, ఆదివారము పలకరింపు అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఆదివారము ఒక టీచర్ ఒక మాస్టర్ వారి గారి ఇంటికి వెళ్లి కుటుంబ సంక్షేమ విషయములు తెలుసుకొని వారి కుటుంబంలో ఎవ్వరు కూడా ఇతర మతములలోకి జాయిన్ అవ్వకుండా హిందూ ధర్మం గురించి అనేక విషయాలు చెప్పి మతమార్పిడి నుండి కాపాడుకొనుటకు అనేక ప్రయత్నంలు చేయుచున్నాము ప్రతి సంవత్సరము హిందూ టీచర్స్ మాస్టర్స్ సంతోషంగా ఉండాలని కష్టాలు లేకుండా ఉండాలని యజ్ఞములు కూడా చేయుచున్నాము సంఘ పరివార్ లో ఉన్నటువంటి అనేక కార్యక్రమంలో మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మాస్టర్స్ లెక్చర్స్ ను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది,
ప్రతి డివిజన్లో ఇంటి దగ్గర ప్రైవేట్ గా ట్యూషన్ చెప్పుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి కొంతమంది టీచర్లను మాస్టర్లను కలవటం వారి దగ్గరికి వచ్చేటువంటి ట్యూషన్ పిల్లలకు దేశభక్తి గురించి అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది,
సంఘ పరివారం నుండి వచ్చిన మిత్రులు అనేక కార్యక్రమాలు నడుపుతున్న సంస్కార భారతి అనే పేరు మీద గుంటూరు జిల్లాలో విద్యార్థినీ విద్యార్థులకు అనేక పోటీలు వ్యాసరచన పోటీలు ముగ్గుల పోటీలు అనేక కార్యక్రమంలో చేయూచుటలో సహాయముగా సహాయకులుగా ఉన్నాము.